Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:17AM

తెగని ఎస్జీటీ లొల్లి..!


గుంటూరు (విద్య): డీఎడ్‌(డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌), బీఎడ్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) అభ్యర్ధుల మధ్య డీఎస్సీ వివాదంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల మరింత జాప్యం అయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గతంలో జిల్లాకు కేటాయించిన పోస్టులకు ఆర్థికశాఖ కోత విధించడంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు మరింత ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈనెల 5న గుంటూరులో జరిగే ఉపాధ్యాయ దినోత్సవం రోజున విడుదల చేస్తామని విద్యశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. దీంతో అభ్యర్ధులు ఎంతో ఆశగా ప్రకటన కోసం ఎదురు చూశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా బీఎడ్‌ పూర్తిచేసిన వారికి డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పిస్తామని ప్రకటించారు. ఈ విసయమై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌)ని కోరారు. ఈ సంస్థ నుంచి ఇంత వరకు నివేదిక రాలేదు. 5న ప్రకటించాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. తాజాగా డీఎస్సీ విడుదల మరింత జాప్యం అయ్యే పరిస్థితి కలిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర వాప్తంగా గతంలో ప్రకటించిన 10,900 పోస్టులకు కాగాను ఆరిఽ్ధక శాఖ 7,900 పోస్టులకు మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు మరింత ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు సంబంఽధించి ఇటీవల విద్యాశాఖ గుర్తించిన పోస్టుల వివరాలు పరిశీలిస్తే తెలుగు (ఎస్జీటీ) 672, ఉర్దూ 10, లాంగ్వేజీ పండిట్‌ తెలుగు 15, హిందీ 26, ఉర్దూ 1, సంస్కృతం 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయిలో హిందీ 4, గణితం 16, భౌతికశాస్త్రం 11, బయలాజికల్‌ సైన్స్‌ 17, ఇంగ్లీష్‌ 10, సోషల్‌ 52, సంస్కృతం 1, ఉర్దూ 1 పోస్టులు చొప్పున మొత్తం 924 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇందులో దాదాపు 200 పోస్టులకు వరకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయిలో పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు పోటీ పడాల్సిఉండగా, ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్ధులు పోటీ పడతారు. ఈ లెక్కన 163 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 1:25 నిష్పత్తిలో బీఎడ్‌ అభ్యర్థులు పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది. 670పైగా ఉన్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల పోస్టులకు 1:3 చొప్పున పోటీ ఉండే అవకాశం ఉందని సీనియర్‌ ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే డీఎడ్‌ పూర్తి చేసిన 5వేల మంది, బీఎడ్‌ పూర్తి చేసిన వారు 10వేల మందికిపైగా ఉన్నారు. 2012 తరువాత దాదాపు 2 సంవత్సరాల తరువాత 2014లో డీఎస్సీని విడుదల చేయనున్నడంతో అభ్యర్థులు తీవ్ర స్థాయిలో పోటీ పడే అవకాశం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.
బీఎడ్‌ అభ్యర్ధులకు ఎస్జీటీలో
అవకాశంపై అభ్యతరం
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం డీఎస్సీలోని ఎస్జీటీ పోస్టులను డీఎడ్‌ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. 2008 నుంచి 2012 డీఎస్సీ వరకు ఇదే నిబంధన అమలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేట్టిన తరువాత కూడా ఇదే విషయాన్ని బీఎడ్‌ అభ్యర్ధులకు చెప్పారు. ఈ నిర్ణయం అమలో చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఎన్‌సీటీఈని కోరారు. ఆ సంస్థ నుంచి ఇంత వరకు నివేదిక రాలేదు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో మరింత జాప్యం జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎస్‌జిటి పోస్టులు బిఇడి అభ్యర్ధులకు కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఈ పోస్టులు తమకే కేటాయించాలని, బిఇడి అభ్యర్దులకు కేటాయించడం ఎన్‌సిటిఇ నిబంధనలకు నిరుద్దమని నిరుద్యోగ ఎస్‌జిటిలు స్పష్టం చేస్తున్నారు. ఎదిఎమైనా డి ఎస్సీ విడుదల కోసం మరికొన్ని రోజులు నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిందేనని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.