Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:17AM

అవకతవకలను సహించం


ఆంధ్రజ్యోతి - గుంటూరు: పేదలకు అందించాల్సిన చౌక డిపో సరుకులను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మే డీలర్లను ఎట్టి పరిస్థితుల్లో సహించమని వారి అక్రమాలను సమర్థించేది లేదని రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 13 జిల్లాల రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిల్లర్లు రేషన్‌ డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దన్నారు. మిల్లర్లు ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఘర్షణ పడవద్దని సూచించారు. ప్రభుత్వం మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. లెవీ విధానాన్ని త్వరలో ఖరారు చేస్తామన్నారు. పన్నులు, పర్మిట్లు, విద్యుత్‌ బిల్లులు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు మంచి ధర చెల్లిస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు ఆహార ఉత్పత్తులను అందించడానికి దళారీల వ్యవస్థను తొలగించాలని వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు సూచించారు. టమోట, ఉల్లి ఇతర ఆహార ఉత్పత్తుల ధరలను తగ్గించటానికి ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. సోనామసూరి బియ్యం కిలో రూ.30కు వినియోగదారులకు అందించే విధంగా రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చే శామని చెప్పారు.
విజిలెన్స్‌ పేరిట భయాందోళనలు :
మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం అన్ని వర్గాలకు రాయితీలు ఇస్తు న్నా మిల్లర్లను పట్టించుకోవడం లేదని మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో అమలులో ఉన్నవిధానాలను ఇక్కడ ప్రవేశపెట్టాలన్నారు. విజిలెన్స్‌ దాడుల పేరుతో మిల్లర్లను అధికారులు భయపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి సాదినేని హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం మిలర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, హాస్టల్‌కు సన్నబియ్యం సరఫరా చేయాలన్నారు. రైతు బజారులలో దళారులను తొలగించాలని కోరారు. శాసనమండలి విప్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ గిడ్డంగుల్లో ఉన్న ఆహార ఉత్ప త్తులను మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మిల్లర్ల నాయకుడు కొల్లా మస్తాన్‌రావు మాట్లాడుతూ చౌక డిపో బియ్యం కొనుగోలు చేయమని మిల్లర్ల ద్వారా ప్రమాణం చేయించాలని సూచించారు. సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌ రవిబాబు మాట్లాడుతూ వినియోగదారులకు ఆహార ఉత్పత్తులను తక్కువ ధరకు అందించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు గోదావరి మిల్లర్ల నాయకుడు అంబటి రామకృష్ణారావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన విధానాలను కొనసాగించాలన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మిల్లర్ల నాయకుడు కృష్ణారావు మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వస్తున్నట్లు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగనాఽథరాజు మాట్లాడుతూ గిడ్డంగుల సౌకర్యాన్ని పెంచాలన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ విధానాలను మార్పు చేయాలన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన గుప్తా మాట్లాడుతూ టిన్‌ నెంబర్ల పేరుతో అధికారులు మిల్లర్లను వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు సునీత, పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపనేని తదితరులను మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులు శాలువాలు కప్పి సత్కరించారు. సమావేశంలో కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, జేసీ వివేక్‌యాదవ్‌, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఊరా భాస్కరరావు ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, ధారపనేని నరేంద్ర, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్‌ మద్దాళి గిరి, మాచర్ల ఇన్‌ఛార్జ్‌ చలమారెడ్డి, గఫార్‌ పాల్గొన్నారు.
సమావేశంలో మిల్లర్ల వాదులాట
సమావేశంలో కొంత మంది మిల్లర్లు ఘర్షణకు దిగారు. తూర్పు గోదావరి జిల్లాకు చెంది న రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత ధాన్యం నిల్వలను కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై కృష్ణా జిల్లాకు చెందిన రంగారావు మాట్లాడుతూ కొంత మంది పెద్ద మిల్లర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను మార్చుకోవద్దని సూచించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ దశలో మంత్రి పరిటాల, మాజీ మంత్రి ఆలపాటి జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది.