Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 01:52AM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సాంబశివరావు
నిర్మల్‌, సెప్టెంబర్‌ 10 : ముంపు ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సాంబశివరావు సూచించారు. బుధవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందజేయాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, గర్భిణుల ప్రసవ సమయాన్ని గుర్తించి ముందస్తుగానే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రమాదాలను నివారించాలన్నారు. సమావేశంలో వైద్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీ ఎంహెచ్‌వో రుక్మిణి, డీఈవో చందు, ఏడీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.