Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 01:52AM

కాలుష్య నియంత్రణ మండలి విభజనకు విధి విధానాలు ఖరారు


ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ రాషా్ట్రనికి ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి (టీ పీసీబీ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న బోర్డును విభజించే విషయంపై ఇప్పటికే రెండు రాషా్ట్రల పర్యావరణం, అటవీశాఖ ముఖ్య, ప్రత్యేక కార్యదర్శులు ఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగుల స్థానికతను నిర్ణయిం చాలని, అయితే కొన్ని కేటగిరీల ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు ఇవ్వాలని నిర ్ణయించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న భార్య, భర్తలు, రెండేళ్ల కంటే తక్కువ సర్వీసు మిగిలిన వారికి ఆప్షన్లు ఇస్తారు. పెన్షనర్లకు సంబంధించిన అంశాలను ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 59వ సెక్షన్‌ ప్రకారం అమలుచేస్తారు. మొత్తం పోస్టులను 58.32 నిష్పత్తిలో విభజించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలను తెలంగాణ పీసీబీ సభ్యకార్యదర్శి తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి రేమండ్‌ పీటర్‌ ఈ ఉత్తర్వుల్లో తెలిపారు.