Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 01:34AM

పీర్‌లెస్‌ శాఖలు మూసివేయొద్దు


జూ ఆల్‌ ఇండియా పీర్‌లెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పీర్‌లెస్‌ యాజమాన్యం తన ఆర్‌ఎన్‌బిసి వ్యాపారాన్ని కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, శాఖల మూసివేతను వెంటనే నిలిపివేయాలని అఖిల భారత పీర్‌లెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సౌత్‌ సెంట్రల్‌ జోన్‌) ప్రెసిడెంట్‌ ఎవి రమణా రావు, జనరల్‌ సెక్రటరీ సివిఎ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం కంపెనీ ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ ధర్నాలో జోన్‌ జాయింట్‌ సెక్రటరీ కె నాగలక్ష్మి, సిఐటియు నాయకులు ఎస్‌ నరసింహా రెడ్డి, వివిధ శాఖలు, రీజినల్‌ మెచ్యూరిటీ సెల్‌ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కంపెనీ రీజినల్‌ అకౌంటెంట్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.