Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 01:34AM

గ్రూప్‌ కంపెనీలూ డిఫాల్టర్లే




ముంబై: రుణాలు ఎగ్గొట్టే కంపెనీలకు గ్యారెంటీ ఇచ్చిన వారిపై కూడా విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌ ముద్రవేస్తామన్న ఆర్‌బిఐ మరో అడుగు ముందుకేసి ఒక గ్రూప్‌లో ఏదైనా కంపెనీ రుణాలు తీర్చకుంటే మొత్తం గ్రూప్‌ను, మేనేజ్‌మెంట్‌ ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఇకపై రుణాలు తీర్చలేని కంపెనీ, ఆ గ్రూప్‌లోని ఇతర కంపెనీల బాలెన్స్‌ షీట్ల ఆధారంగా నిధులు సమీకరిస్తే ఆ గ్రూప్‌ మొత్తంమీద ఎగవేతదారు ముద్ర పడుతుంది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసుల్లాంటి కేసుల్లో ప్రమోటర్‌ గ్యారెంటీ ఉండి, ఆ గ్రూప్‌లోని ఇతర కంపెనీలు లాభాల్లో నడుస్తున్నా రుణాలు చెల్లించేందుకు సదరు కంపెనీలకు నిరాకరిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో 5 శాతం రుణాలు మొండి బకాయిల పద్దులోకి చేరగా మరో 5 శాతం రుణాలు ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో రుణాల ఎగవేతదారులపై కన్నెర్ర చేస్తున్న ఆర్‌బిఐ వారి భరతం పట్టేందుకు విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌ ముద్రను ఉపయోగించాలని నిశ్చయించింది. అయితే ఆర్‌బిఐ ప్రస్తుత నిబంధనలు కింగ్‌ఫిషర్‌ కేసులో వర్తించవు. ఈ ఆదేశాలు జారీ అయిన తర్వాత కేసుల్లోనే ఈ నిబంధనలు వర్తిస్తాయి. డిఫాల్టింగ్‌ యూనిట్ల పరిధిలోకి వ్యక్తులు, కంపెనీలు వస్తాయని ఆర్‌బిఐ స్పష్టతనిచ్చింది