Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:43AM

ఆటిజమ్‌ సమస్యకు చికిత్స



ఆటిజమ్‌ అనేది ఒక న్యూరో డెవలప్‌మెంట్‌ డిజార్డర్‌. మెదడులో ఎదుగుదల లోపం వల్ల వచ్చే సమస్య..దీంతో బాధపడే పిల్లలు ఎవరితోను కలవక పోవటం, ఒంటరిగా ఉండటం లాంటివి గమనించవచ్చు. ఆటిజమ్‌ సమస్యను ఆయుర్వేద చికిత్సతో పరిష్కరించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణురాలు డాక్టర్‌ లక్ష్మీ.
కొన్ని జన్యు సంబంధ కారణాలు, గర్భవతిగా ఉన్నపుడు తల్లికి రుబెల్లా సైటోమెగాలే లాంటి వైరస్‌ ఇన్ఫెక్షన్‌లు, మద్యం తాగడం, పొగ తాగే అలవాట్ల వల్ల వారికి పుట్టే పిల్లలకు ఆటిజం సమస్య రావచ్చు. డయాబెటిక్‌, థైరాయిడ్‌ లాంటి సమస్యలతో బాధపడుతూ సరైన చికిత్స తీసుకోకున్నా, సరిగా భద్రపర్చని బ్యాక్సిన్‌ తీసుకోవటం వల్ల కూడా వారి పిల్లలకు ఆటిజం వచ్చేందుకు ఆస్కారముంది.
ఆటిజంను ఎలా గుర్తించాలి?
ఆటిజం లక్షణాలను పిల్లలకు మూడు సంవత్సరాల వయసు వచ్చేవరకు గుర్తించలేక పోవచ్చు. తెలివితేటలు సాధారణంగా ఉండి, భావవ్యక్తికరణ, భావాన్ని అర్ధం చేసుకోలేక పోవటం, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు తీవ్రంగా లేకుంటే యాస్పర్‌గెస్‌ సిండ్రోమ్‌ అంటారు.
ఆటిజం లక్షణాలు
- కొత్తదనానికి తొందరగా అలవాటు పడలేరు.
- రొటీన్‌గా ఉండ టానికి ఇష్టపడతారు.
- ఒకే రకమైన ఆహారాన్ని, ఆట వస్తువులను కోరుకుంటారు.
- ఒకే రంగు దుస్తులు వేసుకుంటారు.
- అలవాటు పడిన వ్యక్తులతో మాత్రమే ఉంటారు.
- మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల కాళ్లు చేతులు విచిత్రంగా ఆడిస్తుంటారు.
చికిత్స
ఆటిజమ్‌ మెదడులో ఎదుగుదల లోపం వల్ల వచ్చే సమస్య. ఈ సమస్యకు చికిత్సలో మేధస్సును పెంపొందించే మేఽధుకర ఓషఽదుల సేవనం సూచించారు. సరస్వతి యారిష్ఠం, బ్రహ్మరసాయనం, కళ్యాణఘృఽతం లాంటి మందులతో పాటు కొన్ని ప్రత్యేకమైన తైలాలతో శిరోవస్తి లాంటి చికిత్స పద్ధతులు ఆటిజం సమస్య పరిష్కారానికి ఉపయోగకరంగా ఉంటాయి.
డాక్టర్‌ లక్ష్మీ (ఎం.డి., ఆయుర్వేద)
స్టార్‌ ఆయుర్వేద
సికింద్రాబాద్‌
ఫోన్‌ : 8977336677
www.starayurveda.com
Email: [email protected]