Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:42AM

రంగులతో హ్యాపీ మూడ్‌

చెప్పడం సులభమే కానీ ఇంటికి రంగులు ఎంపిక చేసుకోవడం చాలాకష్టం. ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని, కంటికి ఇంపుగా ఉండ రంగులను ఎంచుకోవాలని ఉంటుంది. కానీ ఎంపిక చేసే సమయంలలో ఏ రంగు ఎంపిక చేసుకోవాలో అర్థం కాదు. రంగులు మూడ్‌ను సెట్‌ చేస్తాయి. ప్రస్తుతం కొన్ని వందల రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగు ఎంపిక చేసుకోవాలనేది మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

 
పసుపు : ఈ రంగు ఎక్కువ వెలుతురును ఇస్తుంది. గది వాతావరణం వెచ్చగా ఉన్న ఫీలింగ్‌ను కలగజేస్తుంది. ఎక్కువ మంది ఈ రంగును ఎంపిక చేసుకుంటారు.
 
ఆకుపచ్చ : ఈ రంగు పాజిటివ్‌ ఎనర్జీని అందిస్తుంది. రిలాక్సేషన్‌ను అందిస్తుంది. తాజాదనాన్ని ఇస్తుంది.
 
నీలం : కొత్తదనాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రశాంతతను అందిస్తుంది.
 
ఎరుపు : ఉద్వేగానికి కారణమవుతుంది. రక్తపోటును పెంచుతుంది. ఈ రంగును ఇంటికి ఎంపిక చేసుకోవడం మంచిది కాదు.
 
ఆరెంజ్‌: ఈ రంగు ఎక్కువ వెలుగునిస్తుంది. సంతోషాన్ని కలగజేస్తుంది.
 
నలుపు : సొగసును, స్టైలిష్‌నెస్‌ను, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే ఎవరూ ఈ రంగును ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపరు.
 
తెలుపు : ఇది ఎవర్‌గ్రీన్‌ కలర్‌. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ రంగు వేసుకోవడం వల్ల గది విశాలంగా కనిపిస్తుంది. విశాలంగా ఉన్న ఫీలింగ్‌ను కలగజేస్తుంది.