Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:40AM

మృదువైన పాదాల కోసం




సాధారణంగా మనం చేతుల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ అంతే సమానంగా పాదాలనూ పట్టించుకోవాలి. తరచుగా స్క్రబ్‌ చేస్తూ, ఎక్స్‌ఫోలియేటర్స్‌ ఉపయోగిస్తూ, మాయిశ్చరైజర్లు వాడుతూ ఉంటే పాదాలు కూడా చేతులంత మృదువుగా, కోమలంగా తయారవుతాయి. ఇందుకోసం ఈ హోమ్‌మేడ్‌ టిప్స్‌ పాటించి చూడండి.
బ్రౌన్‌ సుగర్‌
ఒక బౌల్‌లో 2 టేబుల్‌ స్పూన్ల బ్రౌన్‌ సుగర్‌, ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. గోరువెచ్చని నీటిలో పాదాలను 10-15 నిమిషాలు నానబెట్టి తయారుచేసిపెట్టుకున్న బ్రౌన్‌సుగర్‌ పేస్ట్‌తో కాళ్లకు వలయాకారంలో మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి పాదాలు కోమలంగా తయారవుతాయి.
అరటిపండు
అరటిపండు మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జుని స్క్రబ్‌గా వాడితే రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ పండుకు అవకాడో గుజ్జును జోడించి కూడా మసాజ్‌ చేయవచ్చు. ఇలా చేయటం వల్ల పాదాలు మృదువుగా మారి కాంతులీనుతూ ఉంటాయి.
లావెండర్‌ లేదా లెమన్‌
ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌కు రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసం లేదా లావెండర్‌ ఆయిల్‌ కలిపి సీసాలో నింపి పాలలా తయారయ్యేవరకూ బాగా కుదపాలి. ఇలా భద్రపరుచుకున్న సొల్యూషన్‌ను అవసరమనుకున్నప్పుడంతా ఉపయోగించవచ్చు. సీసాను బాగా కదిలించి పాదాలకు నేరుగా అప్లై చేయాలి. ఈ సొల్యూషన్‌ వల్ల పాదాలు కోమలంగా తయారవుతాయి