Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:19AM

మార్చికల్లా 450 ఔట్‌లెట్లు


 మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ సిఇఒ నాగేంద్ర పల్లె

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూజ్డ్‌ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్న మహీంద్రా ఫస్ట్‌చాయిస్‌ వీల్స్‌ వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ డీలర్‌షిప్‌ల సంఖ్య 450కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌ ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సిఇఒ నాగేంద్ర పల్లె మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 380 డీలర్‌షిప్‌లున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఇది ఏడో డీలర్‌షిప్‌ అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ పరిమాణం ఏడాది కి 30 లక్షల యూనిట్ల వరకు ఉన్నదని, వాటిలో వ్యవస్థీకృత రంగం వాటా 16 నుంచి 17 శాతమని ఆయన తెలిపారు. వ్యవస్థీకృత విక్రేతల్లో తమది నాలుగు శాతం వాటా అని ఆయన అన్నారు. ఈ మార్కెట్‌ ఏటా 20 శాతం వంతున వృద్ధి సాధిస్తున్నదని ఆయన తెలిపారు. మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ తమ వద్దకు వచ్చే యూజ్డ్‌ కార్లను సమగ్రంగా తనిఖీ చేసి వాటి పనితీరును ధ్రువీకరించేందుకు ‘ఆటో ఇన్‌స్పెక్ట్‌’ పేరిట థర్డ్‌ పార్టీ తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టిందని, అలాగే కస్టమర్లు వివిధ రకాల ధరలు పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చేందుకు ఇండియన్‌ బ్లూబుక్‌ పేరిట కొత్త ఉత్పత్తిని కూడా అందుబాటులో ఉంచామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యతిన్‌ ఛాదా తెలిపారు. తమ ఔట్‌లెట్లలో అమ్ముడుపోతున్న కార్ల సగటు ధర 3 నుంచి 3.5 లక్షల రూపాయలున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు రెండింటిలోనూ ప్రస్తుతం 15 డీలర్‌షిప్‌లుండగా ఈ ఏడాది చివరికి వాటి సంఖ్య 25కి పెంచాలనుకుంటున్నామని నాగేంద్ర చెప్పారు. ్క