Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:18AM

ఎన్‌ఇఐఎ అధీకృత మూలధనం పెంపు


న్యూఢిల్లీ: ఎగుమతుల ప్రాజెక్టులకు చేయూత నిచ్చేందుకు జాతీయ ఎగుమతుల బీమా అకౌంట్‌ (ఎన్‌ఇఐఎ) అధీకృత మూలధనాన్ని ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఎన్‌ఇఐఎ ట్రస్ట్‌ ఆథరైజ్డ్‌ కార్పస్‌ను 4,000 కోట్ల రూపాయలకు, రిస్క్‌ అండర్‌టేకింగ్‌ సామర్థ్యాన్ని 20 రెట్లకు పెంచేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో భారీ ప్రాజెక్టులను అండర్‌రైట్‌ చేసేందుకు వీలుగా ఎన్‌ఇఐఎ సామర్థ్యం పెరగనుంది. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం మౌలికవసతులు, కనెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశించిన 5,300 కోట్ల రూపాయల ప్రాజెక్టును క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇంతవరకు టెలికాం కవరేజి లేని ప్రాంతాలు 2జి మొబైల్‌ కవరేజి కిందకు రానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 21 శాతం గ్రామాలకు కనెక్టివిటీ సదుపాయం లేదు.
జమ్మూ కాశ్మీర్‌లో 8,112 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన ఎన్‌హెచ్‌పిసి పకాల్‌దుల్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.