Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:17AM

ఆమ్వేకు హైకోర్టులో ఊరట



హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఆమ్వే ఇండియాకు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. స్తంభింపజేసిన ఆ సంస్థ బ్యాంక్‌ ఖాతాలను నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణ్‌ జ్యోతి సేన్‌గుప్త, జస్టిస్‌ పివి సంజయ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. అయితే.. హైకోర్టు రిజిస్ర్టార్‌ (జ్యూడీషియల్‌)కు రూ.50 లక్షలకు బ్యాంకు గ్యారెంటీని సమర్పించి చట్ట నిబంధనలకు లోబడి బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలని బెంచ్‌ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. సంస్థ పేరున ఉన్న స్థిరాస్తులను ఎవరికీ బదలాయించరాదని ఆంక్షలు విధించింది. ఈ సంస్థపై వచ్చిన అభియోగాలపై సిఐడి అధికారులు దర్యాప్తు కొనసాగించాలని స్ప ష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించి వ్యాపారం చేస్తోందనే అభియోగాలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేసి ఈ ఏడాది మే నెలలో ఆ సంస్థ నిర్వహిస్తున్న బ్యాంకు అకౌంట్లను స్థంబింప చేశారు. బ్యాంకు అ ధికారుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆమ్వే హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి బ్యాంకు అకౌంట్ల నిర్వహణకు ఆంక్షలు విధించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై ఆమ్వే సంస్థ డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌లో ఆమ్వేకు ఊరట లభించింది.