Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:11AM

ముగింపు బలహీనం


నిఫ్టీ బుధవారం మైనర్‌ కరెక్షన్‌తో ప్రారంభమై 8100 వద్ద కన్సాలిడేట్‌ అయినా తదుపరి దిగజారి చివరికి ఆ స్థాయి కన్నా దిగువన డే కనిష్ఠ స్థాయిలో క్లోజయి మరింత అప్రమత్త సంకేతం ఇచ్చింది. గత రెండు రోజుల్లో టెక్నికల్‌గా మార్కెట్‌ మైనర్‌ కరెక్షన్‌లో 100 పాయింట్ల వరకు దిగజారినా ప్రధాన ట్రెండ్‌ మాత్రం ఎగువకే ఉంది. గతవారంనాటి గరిష్ఠ స్థాయికన్నా దిగజారడం స్వల్పకాలంలో మరింత అప్రమత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. గత వారం కనిష్ఠ స్థాయి 8050కి చేరువవుతూ ఉండడం కూడా అప్రమత్త సంకేతం. అలాగే పది రోజుల డిఎంఏకి కూడా చేరువలో ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ రికవరీ సాధించి తీరాలి.
నిరోధం : 8140 మద్దతు : 8050
ఈ రోజెలా ఉండవచ్చు?
జూ మరింత బలహీనత ప్రదర్శించి 8100 కన్నా దిగువన ట్రేడయితే మైనర్‌ కరెక్షన్‌ సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 8050 వద్ద కన్సాలిడేట్‌ కావచ్చు. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో ప్రవేశిస్తుంది.
జూ బ్యాంక్‌ నిఫ్టీ కూడా కీలక స్థాయి 16000 కన్నా స్వల్పంగా పైన ఉంది. ట్రెండ్‌లో భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
జూ రికవరీ బాట పడితే 8100 కన్నా పైన మైనర్‌ అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ప్రధాన నిరోధం, టార్గెట్లు 8150, 8200.
సూచన: స్పష్టమైన సానుకూలత కనిపించే వరకు ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో తాజా లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండడం మంచిది. 8050 దిగువన ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లు హోల్డ్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఠరిఠిష5ేళీ