Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:11AM

కశ్మీర్‌ వరద బాధితులకు ఎయిర్‌సెల్‌ చేయూత


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జమ్మూకశ్మీర్‌లో తీవ్ర వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తన వంతుగా చేయూతనివ్వాలని టెలికాం సంస్థ ఎయిర్‌సెల్‌ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు రెండు రోజుల పాటు (10,11 తేదీలు) ఉచితంగా కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని వల్ల వరదల్లో చిక్కుకున్న వారు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా సంస్థ అందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారు తమ కుటుంబ సభ్యులకు ఉచితంగా ఫోన్‌ చేసుకునేందుకు వీలుగా కాలింగ్‌ బూత్‌లను కూడా సంస్థ ఏర్పాటు చేసింది.