Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:10AM

స్కోడా నుంచి అప్‌గ్రేడెడ్‌ యెతి


ముంబై: స్కోడా తన అప్‌గ్రేడెడ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యువి యెతిని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 18.63- 20.14 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూం ముంబై)గా ఉంది. స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా సమీప భవిష్యత్‌లో భారత్‌లో మరే కొత్త మోడల్‌ను విడుదల చేయటం లేదని స్కోడా అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో స్కోడా యెతి మోడల్‌కాకుండా మరో మూడు డీజిల్‌ మోడళ్లు (సూపర్బ్‌, ఆక్టావియా, ఫాబియా) అందుబాటులో ఉన్నాయి. వచ్చే 18- 24 నెలల కాలంలో ఆక్టావియా, సూపర్బ్‌ కార్లకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని స్కోడా ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ రావు చెబుతున్నారు. సర్వీసింగ్‌ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు డీలర్‌షిప్‌, సర్వీస్‌ సెంటర్లను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి దేశంలో 80 డీలర్‌షిప్‌లు, 79 సర్వీసింగ్‌ సెంటర్లు ఉన్నాయి.ఛిఛిుఽ=(ట్ఛజ్ఛటట్చజూ)్ఢఠ్టఝఛిఝఛీ=ట్ఛజ్ఛటన4ూఠ