Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 16:19PM

రాజ్‌భవన్‌ను ముట్టడించిన జర్నలిస్టు సంఘాలు, అరెస్టు, గోషామహల్‌ పీఎస్‌కు తరలింపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాజ్‌భవన్‌వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. టీ. సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ మీడియా గొంతు నొక్కేస్తున్నారని వారు విమర్శించారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ ఆందోళనకు తరలివచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జర్నలిస్టులను అరెస్ట్‌ చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
 
గవర్నర్‌ సరసింహన్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను ఈడ్చుకువెళ్లి వ్యాన్‌లలో పడేశారు. దీంతో రాజ్‌భవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో బతకాలంటే తమకు సెల్యూట్‌ కొట్టాల్సిందే అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై జర్నలిస్టులు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య పాలనా, లేక నియంతృత్వ పాలనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.