desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 15:43PM

గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు, ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

గుజరాత్‌, సెప్టెంబర్‌ 10 : గుజరాత్‌లోనూ భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వడోదర సహా అనేక జిల్లాలు అస్తవ్యస్థంగా మారాయి. రాష్ట్రంలోని నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలపై వరదల ప్రభావం అధికంగా ఉంది. కుండపోత వర్షాలకు నదుల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. కుండపోత వర్షాలకు నదుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఫలితంగా నదీ పరివాహక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
 
వడోదర జిల్లాలో విశ్వామిత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సుమారు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వడోదర నగరం వద్ద విశ్వామిత్ర నది ప్రమాద స్థాయిని మించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు దాదర్‌ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నర్మదా నది నీటి మట్టం కూడా భారీగా పెరిగింది. మరోవైపు వరదల కారణంగా 9 జిల్లాల్లోని రహదారులు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. అధికారులు సహాయ కార్యక్రమలు ముమ్మరం చేశారు.