Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 14:11PM

తెలంగాణలో ఒకరికి సెల్యూట్‌ కొట్టాల్సిన అవసరం లేదు : బొత్స

విజయవాడ, సెప్టెంబర్‌ 10 : మీడియాపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒకరికి సెల్యూట్‌ చేసి బతకాల్సిన అవసరం లేదని, దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతికే శ్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని బొత్స పేర్కొన్నారు. గాంధీ, అంబేద్కర్‌ లాంటి మహానుభావులకే సెల్యూట్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్‌ పరిధిలోనే ఉన్నాయని, ఛానెళ్ల నిషేధంపై గవర్నర్‌ చొరవ తీసుకోవాలని బొత్స డిమాండ్‌ చేశారు.