desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 14:01PM

ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసీఆర్‌ కక్షగట్టారు : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరిపై కేసీఆర్‌ కక్షగట్టారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, జర్నలిస్టులపై లాఠీచార్జ్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ 100 రోజుల పాలనలో అమరుల కుటుంబాలను గుర్తించారా అని రేవంత్‌ ప్రశ్నించారు.
 
అమరుల త్యాగాలపై చర్చ జరుగుతుందనే ఇంతవరకు జాబితా ఎందుకు సిద్ధం చేయలేదని నిలదీశారు. మెదక్‌ జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకోలేదని విమర్శించారు. విద్యార్థులపై ఎందుకు కేసులు ఎత్తివేయలేదన్నారు. ఓయూలో ఇంకా ఆంక్షలు ఎందుకు కొనసాగుతున్నాయని, ఇంకా విద్యార్థులపై లాఠీచార్జ్‌ కొనసాగుతోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.