Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 12:43PM

సీఎం స్థాయి వ్యక్తి మీడియాను అణిచివేస్తాననడం సరికాదు : ఎంపి పొన్నం

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 10 : ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీడియాను అణిచివేస్తాననడం సరికాదని కేసీఆర్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం సమంజసమా అని ప్రశ్నించారు.
 
విపక్షాల వార్తలు టీ న్యూస్‌లో ప్రసారం చేయడంలేదని ఆరోపించారు. టీ న్యూస్‌ మెడలు ఎవరు వంచాలని పొన్నం నిలదీశారు. సీఎం కేసీఆర్‌ 100 రోజుల పాలన శూన్యం అని విమర్శించారు. పార్టీలోకి వలసలు, సింగపూర్‌ పర్యటన తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విపక్షాలు విమర్శిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.