Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 10:32AM

ఆంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 10 : ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌ వైపుగా వెళ్లడంతో రెండు రాష్ర్టాల్లోనూ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.