Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:30AM

పీజీటీల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి..


న్యూశాయంపేట : ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని ఆదర్శ పాఠశాలల పీజీటీల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం ఉదయం ప్రభుత్వ బీఎడ్‌ కళాశాలలో ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్య అభ్యర్థులను ఉద్దే శించి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం అభ్యర్థులు అన్ని సర్టిఫికె ట్లు కలిగి ఉండాలని ఆయన సూచించారు.
పీజీటీ సర్టిఫికెట్ల పరిశీలనకు 249 మందిని పిలువగా 176 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 73 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. 10న ఉదయం 10గంటలకు టీజీటీ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంద ని 275 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏజీసీ కృష్ణారెడ్డి,డైట్‌, బీఎడ్‌ కళాశాలల అధ్యాపకులు, ఆర్‌జేడీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.