Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:28AM

గోదావరి వరదలతో భారీ నష్టం


వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
తగ్గుముఖం పట్టిన నదీప్రవాహం
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి
ఏటూరునాగారం : ఏటూరునాగారం ఏజెన్సీ ప్రజలను, రైతులను భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. నాలుగురోజులుగా మండలంలో కురిసిన కుండ పోతవర్షాలకుతోడు ఎగువ ప్రాంతంలోని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, పెనుగంగాల వరదల తాకిడికి రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ఉగ్రరూ పం దాల్చింది. దీంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలలో రైతులు సాగు చేసిన వరి, మిర్చి, పత్తి, అరటి పంటలు నీట మునిగాయి. గోదావరి క్రమేపి తగ్గుముఖం పట్టినప్పటికిని వందలాది ఎకరాల్లో పంటలు ఇంకా వరద నీటిలోనే నాలుగు రోజులుగా మురుగుతున్నాయి. వరద తాకిడికి గురైన పంటలు వాడిపోయి మాడిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు.
ప్రధానంగా మండలంలోని లోతట్టు ప్రాంతాలైన రాంనగర్‌, లంబాడి తండా, పప్కాపురం, కోయగూడ ఎల్లాపురం, రామన్నగూడెం, ఓడ గూడెం, లక్ష్మిపురం, గోగుపల్లి, షాపెల్లి, దొడ్ల, మల్యాల, ఐలాపూర్‌, చ ల్పాక, బానాజీబంధం, వీరాపూర్‌ ప్రాంతాలలో సుమారు ఆరు వందల ఎకరాలకుపైగా వరి, పత్తి, మిర్చి, అరటి పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాఽథమిక అంచనా వేస్తున్నారు.
మండలంలో సంభవించిన వరదలకు జరిగిన నష్టాన్ని అంచనవేయాలని కలెక్టర్‌ జి.కిషన్‌ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి శాంతిస్తున్నప్పటికిని పంటపొలాల్లో చేరిన వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో పంట నష్టాన్ని అంచనావేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. రెండేళ్ళుగా పండిన పంటలకు గిట్టుబాటు ధర పలకక మరో వైపు విధ్యుత్‌ కొరత, నకిలీ విత్తనాలు, పురుగు మందులతో నష్టాలు చవిచూసిన మిర్చి, పత్తి, వరి రైతులకు ఈఖరీఫ్‌లో కూడా వీధి వెంటాడడంతో వరదలు సంభవించా యి. దీంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలో అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వరద నష్టంపై స మగ్ర సర్వే చేపట్టి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అం దించి అన్నివిధాల ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
శాంతిస్తున్న గోదావరి...
ఏటూరునాగారం : గత నాలుగురోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ ఎట్టకేలకు క్రమేపి తగ్గుముఖం పడుతుంది. మూడురోజులుగా కురిసిన కుంభ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు పుష్కరఘాట్‌ వద్ద చేరడంతో రెండవ హెచ్చరికకు దాటి 10.95 మీటర్ల వేగంతో తుది హెచ్చరికకు చేరువలో ప్రవహించిన గోదావరితో లోతట్టు ప్రాంతాల ప్రజలు భితిల్లారు. వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. అంతే కాకుండా వరద ముప్పు ప్రాంతాలైన రాంనగర్‌, లంబాడి తండా పప్కాపురం, కోయగూడ ఎలాపురం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పారిశుధ్యం నెలకోవడంతో ప్రజలు అనేక వ్యాధుల భారీన పడుతున్నామని అందోళన వ్యక్తం చేస్తున్నారు.
9మీటర్లకు చేరిన ప్రవాహం..
పుష్కరఘాట్‌ వద్ద పొంగి పొర్లిన గోదారమ్మ ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం వరకు తగ్గు ముఖంపట్టి 8.97 మీటర్లకు చేరింది. మూడు రోజులక్రితం 10.95 మీటర్ల వేగంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం తగ్గుము ఖం పట్టింది. గోదావరి పరవళ్లతో నా లుగు రోజుల పాటు వణికించిన గోదావరి ఎట్టకేలకు వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదలు తగ్గు ముఖం పట్టడంతో లోత ట్టు ప్రాంతాలో చెత్తాచెదారం నిండుకుని పారిశుధ్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్య పనులతో పాటు గ్రామాలలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని లోతట్టు ప్రాంతా ల ప్రజలు కోరుతున్నారు.