Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:27AM

సంపద జాతీపరమైతే పేదరిక నిర్మూలన

మట్టెవాడ : దేశంలోని సంపద జాతి పరం అయినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సమా ఖ్య జాతీయ కన్వీనర్‌ ఎండీ. గౌస్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం వరంగల్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓంకార్‌ భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర కుమార్‌ అధ్యక్షతన జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక స మాఖ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగంపై ఆధారపడి జీ విస్తున్నారని, వారికి పాలక ప్రభుత్వాలు చే యూతనందిండంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరే క విధానాలతో వ్య వసాయం సంక్షోభంలో పడిందన్నారు. అ నంతరం వ్యవసాయ కార్మిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడిగా వరికుప్పల వెంకన్న, ప్రధానకార్యదర్శిగా పరికిరాల భూమయ్యలతో పాటు మరో 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భాషకార్ల బాబు, కె.వి.నరసింహారెడ్డి, మర్రి కొండయ్య, వే ముల పెద నర్సయ్య, ఎండీ. మాషుక్‌ తదితరులు పాల్గొన్నారు.