Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:27AM

విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులను తయారు చేయాలి


న్యూశాయంపేట: విద్యా రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఛాత్రోపాధ్యాయులు(శిక్షణ ఉపాధ్యాయులు)లను తయారు చేయాలని జిల్లా అధనపు సంయుక్త కలెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో జరిగిన డైట్‌డే సందర్బంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏజేసీ కృష్ణరెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ ఛాత్రోపాధ్యాయులకు, ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు శిక్షణలు ఇస్తూ సమాజ అభివృద్ధికి డైట్‌ విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు.
పాఠశాల ఆర్‌జేడీ వై.బాలయ్య మాట్లాడుతూ శిక్షణ ఉపాధ్యాయులు ఇక్కడ పొందిన శిక్షణ అంశాలను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడ అమలు చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యాను అందించే బాధ్యత ప్రతీ ఉపాధ్యాయునిపై ఉందని తెలిపారు. డీఈవో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ శిక్షణ కాలంలో నేర్చుకున్న ప్రతీ విషయాన్ని తరగతి గదిలో అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.లక్ష్మారెడ్డి, అధ్యాపకులు డా క్టర్‌ రవీందర్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, ఎం.సోమయ్య, సోమశేఖర్‌రెడ్డి, ఎం. కృష్ణమూర్తి, కేశవరావు, రాము, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.