Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:26AM

29న అమెరికాకు మోదీ


- రెండు రోజుల పాటు వైట్‌హౌస్‌లో చర్చలు
వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 9: ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయన ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కలవబోతున్నారు. ఆర్థికాభివృద్ధితోపాటు పలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక, రక్షణ, దీర్ఘకాల ప్రయోజనాంశాలు చర్చకు రానున్నాయి. మోదీకి స్వాగతం పలికేందుకు ఒబామా ఎదు రుచూస్తున్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ కార్యదర్శి జోష్‌ఎర్నెస్ట్‌ తెలిపారు. ద్వైపాక్షికంగానేగాక ప్రపంచమంతటికీ మేలు జరిగేలా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు. కాగా, 2005లో మోదీకి అమెరికా వీసా తిరస్కరించటం తెలిసిందే. చివరకు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఒబామా వ్యక్తిగతంగా మోదీని ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, ఇరాక్‌ పరిణామాలపైనా, కలిసి పనిచేయాల్సిన అంశాలపైనా వారు చర్చిస్తారు. మోదీ పర్యటన పూర్తి వివరాలు ఈ నెలాఖరులో వెల్లడిస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి కైట్లిన్‌ హేడెన్‌ తెలిపారు. కాగా, మోదీ వంద రోజుల పాలనలో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించే దిశగా ఒబామా తన ముగ్గురు కేబినెట్‌ మంత్రులను భారత్‌కు పంపించడం విశేషం.