Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:21AM

సాహితీ విశ్వనాథుడు

కరీంనగర్‌ కల్చరల్‌ : తెలుగు సాహిత్యంలో ఎన్ని భావధారలున్నా శిఖరప్రాయంగా నిలిచిన వారిలో కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఒకరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1895లో కృష్ణా జిల్లా నందమూరులో జన్మించిన ఆయన శతాధిక గ్రంథకర్తగానూ, విమర్శకుడిగానూ, సంస్కృతాంధ్ర భాషా పండితుడిగానూ, తొలి తెలుగు జ్ఞాన పీఠ్‌ అవార్డు గ్రహీతగానూ అప్పటి ఆంధ్రదేశ ఆస్థాన కవిగా వెలుగొందారు. విశ్వనాథ చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. కథ, నవల, నాటకం, సాహిత్య విమర్శ, పద్య గద్య ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. వీరి రచనల్లో శ్రీమద్రామాయణ కల్పవృక్షం ప్రపంచ సాహిత్య చరిత్రలో ప్రఖ్యాతి పొందారు. ఆంధ్రప్రశస్తి, శృంగారవీధి, భ్రమరగీతం, కిన్నెర సాని పాటలు, వేయి పడగలు, ఏకవీర, చెలియకట్ట, పునర్జన్మ, భ్రష్ట యోగి వంటి కావ్యాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి విశిష్టతను ఆపాదించుకున్నాయి. విశ్వనాథ కలం లక్షపై చిలుకు పుటలు సృష్టించి మరొకరికి సాధ్యం కాని రికార్డు సృ ష్టించింది. ఆ మహానుభావుడు 1976 అక్టోబర్‌ 18న అస్తమించారు.
కరీంనగర్‌తో విడదీయ లేని అనుబంధం
విశ్వనాథ సత్యనారాయణ షష్టి పూర్తి సందరంగా ఇక్కడి సాహితీ మిత్రులు 1956లో కరీంనగర్‌కు తీసుకొచ్చారు. అప్పుడు రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం కాలేదు. దానికి జువ్వాడి తుక్కారావు అధ్యక్షుడిగా గౌతమరావు, వెలిచాల కొండలరావు సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రిన్సిపాల్‌ కావాలనే కోరికతో గుంటూరులో ఉన్న విశ్వనాథను వారే రప్పించారు. దూల పాటి శ్రీరామమూర్తి అనే తెలుగు ఉప న్యాసకునితో కలిసి ఆయన కరీంనగర్‌ వచ్చారు. 1961 నుంచి 63 వరకు ఎస్‌ఆర్‌ఆర్‌కు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. విశ్వనాథ సాహితీ గరిమను ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా డాక్టర్‌ వెలిచాల కొండాల్‌రావు, 2002లో విశ్వనాథ సాహి తీ పీఠాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆయన రాసిన నవలులు, కావ్యాలపై ఆంగ్లం, తెలుగు భాషల్లో లబ్ద ప్రతిష్టులైన సాహితీ వేత్తలతో సమీక్షా పుస్తకాలు, విశ్వనాథ ఎలిటరసీ లెజెండ్‌ పుస్తకాన్ని వెలువరించింది. విశ్వనాథ పై పలువురి మనోగతాలు..