Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:18AM

పత్తి రైతులకు తీరని నష్టం

కౌతాళం: అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీరని నష్టాలకు గుర య్యారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో మండలం మొత్తం మీద 30వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేస్తే ఇందులో 27వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవ సాయశాఖ అధికారులు తెలిపారు. అయితే గత 15రోజులుగా రెండుసార్లు అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో పత్తి రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ప్రధానంగా వంకలు, వాగులు పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం ధాటికి పత్తి పంట మొత్తం కొట్టుకపోయింది. దీనికి తోడు వర్షపు నీరు పొలాల్లోనే నిల్వ ఉం డటంతో పత్తి పంట అంతా కుళ్లిపోయి రైతు లకు నష్టాలను మిగిల్చింది. ఇప్పటికే ఎకరాకు రూ. 12వేల వరకు ఖర్చు చేశారు. దీంతో ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల పెట్టిన పెట్టుబ డులు సైతం రాని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పత్తి రైతు లను అదుకోవాలని పలువురు కోరుతున్నారు. మండలం మొత్తం మీద 2,500 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినింది.
మూడు ఎకరాల్లో పత్తిపంట నష్టం
- వెంకటేష్‌, రైతు
ఇటీవల కురిసిన వర్షా లకు మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పం ట అంతా దెబ్బతి నింది. ఇప్పటి వరకు పెట్టుబడి రూ. 40వే లకు పైగా ఖర్చు చేశా. అల్పపీడనంతో పంటంతా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకొని పరిహారం చెల్లించాలి.