Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

నాడు బాంచన్‌ దొర.. నేడు శాల్యూట్‌


- మల్లు భట్టివిక్రమార్క
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘నాడు నీ కాల్మొక్తా బాంచన్‌ దొరా అనకపోతే ఊరు నుంచి వెళ్లగొట్టేవారు. నేడు శాల్యూట్‌ అనకపోతే, పది కిలో మీటర్ల లోతున పాతరేస్తామంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. అలా కాకుంటే రాజ్యాంగమే తగు సమయంలో బుద్ది చెబుతుంది’’ అని మాజీ ఉపసభాపతి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వరంగల్‌ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ఇది కేవలం పత్రికా రంగంపై చేసిన వ్యాఖ్యలుగా తాను భావించడం లేదని, ఎవరైనా తనకు శాల్యూట్‌ కొట్టకపోతే.. పాతరేస్తానని హెచ్చరించడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని భట్టి అన్నారు.