desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

గూడూరు నగర కోఆప్షన్‌ సభ్యులను దక్కించుకున్న తెలుగుదేశం

గూడూరు: గూడూరు నగర పంచాయతీకి సంబంధించి మూడు కోఆప్షన్‌ సభ్యులను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మంగళవారం చైర్‌పర్సన్‌ ఇందిరాసుభాషిణి అధ్యక్షతన కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులకు నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీకి చెందిన హసీనాబీ, కలాంబాషా, ఎస్‌ఏ జిలానీలను కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకైనట్లు నగర కమిషనర్‌ రా ధాకృష్ణ వెల్లడించారు. అంతకుముందు ఎన్నికను కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చరణ్‌కుమార్‌, మధుసూదన్‌ వాకౌట్‌ చేసి బయటకు వెళ్లారు. అనంతరం ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులను చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు అభినందించారు. సమావేశంలో మేనేజర్‌ వెంకటేశ్వర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మోహన్‌రావు పాల్గొన్నారు.
‘నగర పంచాయతీ
అభివృద్ధికి కృషి చేస్తాం’
నగర పంచాయతీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులు పేర్కొన్నారు. తమకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కేఈ ప్రతాప్‌, ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు కరుణాకర్‌రాజు, టీడీపీ మండల కన్వీనర్‌ సుందర్‌రాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎల్‌. వెంకటేశ్వర్లు, డాక్టర్‌ మన్నన్‌ బాషా, ఎస్‌ఈ భాస్కర్‌, అక్కలదేవి గిడ్డయ్య, నాగప్పయాదవ్‌, రేమట వెంకటేశ్వర్లు, సురేష్‌, చాంద్‌బాషా, తెలుగుశ్రీను పాల్గొన్నారు.