Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద


జలాశయ 3 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల ఫ 37.655 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి
శ్రీశైలంప్రాజెక్టు: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం 2 క్రస్ట్‌గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు జలాశయానికి వరద నీరు నిలకడగా ప్రవహిస్తుండడంతో తెరచిన రెండు క్రస్ట్‌గేట్లకు తోడు మంగళవారం ఉదయం 6 గంటలకు మరో గేట్‌ను తెరచి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 884.80 అడుగులుగా, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 214.8450 టీఏంసీలుగా నమోదయ్యాయి. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి వరద 1,49,203 క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయం నుంచి 37,200 క్యూసెక్కులు, మొత్తం జలాశయానికి 1,86,403 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా ప్రవహిస్తోంది. అలాగే జలాశయ బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాంత వాసులకు సాగు, తాగు నీటి అవసరాల కోసం 9,490 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీ-నీవా ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం మూడు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 83,949 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయానికి కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 97 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 31,400 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 44,497 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. మొత్తం జలాశయం నుంచి స్పిల్‌వేతో కలిపి ఔట్‌ఫ్లోగా 1,69,686 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాలలో 37.655 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు. ఈ విద్యుదుత్పాదనకుగాను జలాశయం నుంచి 76,347 క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని ఉత్పాదన అనంతరం ఆ నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.