Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:12AM

పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సత్తా చాటనున్న ఏపీ



- ఎలకా్ట్రనిక్‌ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
- టెక్నాలజీ-ఇన్నోవేషన్స్‌ విధానంపై
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌

(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి)
పరిశోధన, అభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ముందు వరుసలో ఉండాలన్న భారత స్వప్నాన్ని నిజం చేయాలని ఏపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం... మంగళవారం టెక్నాలజీ, ఇన్నోవేషన్స్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ రంగంలో అమెరికా ముందు వరుసలో ఉండగా, ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ కూడా ఎలక్ర్టానిక్స్‌ పరిశోధనలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మన దేశం.. ఈ రంగంలో పరిశోధనలపై స్థూల జాతీయోత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువే వెచ్చిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో 5వేల ఇంక్యుబేటర్‌లు ఉండగా, భారత్‌లో 65 మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెదర్లాండ్స్‌, సింగపూర్‌, స్వీడన్‌ వంటి దేశాలు ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో సాంకేతిక పరిశోధనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండగా, మన దేశం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీనిని అనుకూలంగా మలచుకుని ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సంకల్పించింది. వాస్తవానికి 2010-2020 కాలంలో సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌లలో అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి సాధించాలని వాంఛించిన కేంద్రం ఒక విధానపత్రాన్ని కూడా విడుదల చేసింది. జీడీపీలో 2 శాతం వ్యయం చేయాలని నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈ కింద రూ.10,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక పురోభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోన్న తరుణంలో ఎలకా్ట్రనిక్స్‌ పాలసీకి ఏపీ సర్కార్‌ పదును పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జపాన్‌, చైనా తరహాలో ఒక ఎలకా్ట్రనిక్‌, హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ను తయారు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది.
2019 జూన్‌ 30 నాటికి ఎలకా్ట్రనిక్‌ పాలసీ లక్ష్యాలు
- ఏపీలో 100 ఇంక్యుబేటర్‌లు లేదా ఆక్సిలరేటర్ల ఏర్పాటు
- 5000 కంపెనీలు, ఇంక్యుబేటర్‌లతో కూడిన స్టార్టప్‌ ఏర్పాటు
- ఒక మిలియన్‌ చదరపు అడుగుల ఇంక్యుబేటర్‌ల అభివృద్ధి
- కొత్త ఆవిష్కరణల కోసం రూ.1000 కోట్ల సమీకరణ, ఆవిష్కరణల సంస్కృతి పెంపొందించడం
- ఐటీ ఫర్‌ టెన్త్‌.. (ఫార్మా, ఆయిల్‌, గ్యాస్‌, అర్బన్‌ మేనేజ్‌మెంట్‌)
- యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌
- ఇన్నోవేటివ్‌ ఫండ్‌ కోసం రూ.100 కోట్లు కేటాయింపు
- వ్యాట్‌, స్టాంపు డ్యూటీల్లో రాయితీ
- జాతీయస్థాయిలో రూపొందించిన సమగ్ర ఎలకా్ట్రనిక్స్‌ పాలసీ -2012ని దత్తత తీసుకుని ఈ రంగంపై దృష్టి సారించడం
-ఎలకా్ట్రనిక్‌ తయారీ క్లస్టర్ల ఏర్పాటు
- 30,000 కోట్ల పెట్టుబడులు
- కాకినాడలో హార్డ్‌వేర్‌ పార్కు ఏర్పాటు
- విశాఖ-చెన్నయ్‌ కారిడార్‌ ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా ఏర్పాటు