Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:06AM

అంతర్జాతీయ మార్కెట్‌ మేరకు ఖనిజ రేట్లు

ఓబులవారిపల్లె : అంతర్జాతీయ విపణిలో మంగంపేట ఖనిజానికి ఉన్న డిమాండ్‌కు తగిన విధంగా ధరను నిర్ణయించమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీఎండీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు గనుల శాఖమంత్రి పీతల సుజాతతో ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరక్టర్‌ షాలనీ మిశ్రా, ఇతర అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెరైటీస్‌ ఖనిజ విక్రయ టెండర్ల విషయమై ఏపీఎండీసీ యాజమాన్యం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగంపేట బెరైటీఎస్‌ తవ్వకాలు, ఖనిజ ఉత్పత్తి, ప్రస్తుత బెరైటీస్‌ ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బెరైటీఎస్‌కు ఉన్న డిమాండ్‌పై ఎండీని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగంపేట బెరైటీస్‌ ఖనిజానికి ఉన్న డిమాండ్‌ అక్కడి ధరలు సంస్థ వ్యాపారులకు విక్రయించే ధరలు, తవ్వకాలు, ఖనిజ ఉత్పత్తులపై ముఖ్యమంత్రికి వివరించారు. అన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ఖనిజ ఉత్పత్తి మరింత పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండ్‌కు తగిన విధంగా ఖనిజ రేట్లను నిర్ణయించమని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి ప్రసాద్‌, ఏపీఎండీసీ ఈడీ హెచ్‌డి.నాగరాజు, జనరల్‌ మేనేజర్‌ ప్రసాద్‌, డీజీఎం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.