Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 6 2015 @ 00:39AM

స్పెషల్‌ ప్యాకేజీపై జగన్‌ మౌనమేల?: డొక్కా

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా
గుంటూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ఎంతసేపటికీ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే ప్రత్యేకహోదా గురించే మాట్లాడుతున్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు ఉపయోగపడే ప్రత్యేకప్యాకేజీ గురించి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు. దీనిని బట్టే ఆయన వైఖరి ఏమిటో స్పష్టమౌతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. డొక్కా సోమవారం తొలిసారిగా అధికార ప్రతినిధిగా మీడియాతో మాట్లాడారు. జగన్‌ దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.