Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 10:26AM

పొట్లకాయ వడలు

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - అరకేజీ ముక్క, పచ్చిమిర్చి - 6, ఉప్పు - రుచికి తగినంత, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, (వేగించిన) శనగపిండి - 1 కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పొట్లకాయ తొక్క, గింజలు తీసి సన్నగా తురమాలి. పచ్చిమిర్చి, ఉప్పు కలిపి పేస్టు చేయాలి. ఒక లోతైన గిన్నెలో పొట్లకాయ తురుము, పచ్చిమిర్చి పేస్టు, శనగపిండి, బియ్యప్పిండి వేసి అన్నీ బాగా కలిపి ముద్ద చేసి అరగంట పక్కనుంచాలి. తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకుని (తడి పీల్చుకుంటుంది కాబట్టి) ‘కాటన్‌ క్లాత్‌’ మీద వడల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించాలి. వేడి వేడిగా టమోటా సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.