Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 02:19AM

ఏమైనా.. ఆత్మహత్యలను ఆపాలి: బీఆర్‌ మీనా

హైదరాబాద్‌, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలను అడ్డుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్‌ మీనా.. అధికారులను కోరారు. జీవో 421ని పకడ్బందీగా అమలు చేసి.. రైతులు చనిపోకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో జీవోను సైతం సవరించేందుకు సిద్ధమేనన్నారు. రైతుల ఆత్మహత్యలు, కరువు పరిస్థితిపై ఆయన వ్యవసాయ తదితర శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ‘ఏ మాత్రం అనుమానమొచ్చినా రైతులకు కౌన్సెలింగ్‌ ఇవ్వండి. వడ్డీ వ్యాపారులను నియంత్రించండి. రైతులకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించండి’ అని ఆదేశించారు. ఆత్మహత్యల నివారణకు హెల్ప్‌లైన్‌ నెలకొల్పాలని సూచించారు.