desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 01:49AM

రైతుల అంగీకారంతోనే భూసేకరణ : కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు

విజయనగరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని రైతుల అంగీకారంతోనే సేకరిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 5,311 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, భూములిచ్చే రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రాజధానికంటే మెరుగైన ప్యాకేజీ అందుతుందన్నారు.