Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 00:50AM

వెంకటేశం సారుకు జాతీయ పురస్కారం

  •  నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవార్డు స్వీకరణ
కూసుమంచి, ఏప్రిల్‌ 4: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లికి చెందిన దామళ్ల వెంకటేశం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కూసుమంచి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన కళారంగంలోనూ రాణిస్తున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వెకంటేశం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో శనివారం జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. వెంకటేశం మాస్టారు విద్యాబోధనతో పాటు గజ్జెకట్టి జానపద నృత్యం చేస్తారు. పాటలు రచించి స్వయంగా ఆలపిస్తారు. వెంట్రిలాక్విజంలో ప్రదర్శనలు ఇస్తారు. విజయవాడ, హైదరాబాద్‌ రేడియోస్టేషన్లలో కథానికలు, స్వీయ రచనలు సైతం వినిపించారు.