desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 20:01PM

అమ్మాయిల ‘ఎఫైర్‌’

శ్రీరాజన్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎఫైర్‌’. ప్రశాంతి, గీతాంజలి కథానాయికలు. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘దర్శకుడికిది మూడో సినిమా. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. గీతాంజలి, ప్రశాంతి నటన హైలైట్‌గా నిలుస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉంది. ఈ నెల 13న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘చక్కని లవ్‌ స్టోరీ ఇది. హీరో స్థానంలో ఓ లేడీని పెట్టి తీశాం. ప్రశాంతి, గీతాంజలి తమ పాత్రలకు ప్రాణం పోశారు. కథకు తగ్గ టైటిల్‌ కుదిరింది. దర్శకుడిగా నన్ను నిలబెట్టే చిత్రమిది. మంచి అవుట్‌పుట్‌ కోసం టీమంతా కష్టపడి పనిచేశాం’’ అని దర్శకుడు చెప్పారు. ధనరాజ్‌, రాకేశ్‌, షాని, హరిత, ఫణి, సంపత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేషు.కె.ఎం.ఆర్‌, కెమెరా: కర్ణ.