Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 18:47PM

మహబూబ్‌నగర్‌లో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 04: జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం వంగూరు మండలం కోనాపూర్‌లో అప్పుల బాధ తాళలేక రైతు పర్వతరెడ్డి(50) ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామ జరిపించి కేసు నమోదుచేసుకున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.