Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 14:38PM

కర్ణాటక పొంగల్‌

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, పెసరపప్పు - ముప్పావు కప్పు, పసుపు - అర టీ స్పూను, బెల్లం - 1 టీ స్పూను, నిమ్మరసం - 1 టీ స్పూను, పాలు - 1 కప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం - నెయ్యి / నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు తగినంత.
తయారుచేసే విధానం: మిరియాలు, జీలకర్ర దోరగా వేగించి మెదపాలి. వేగించిన పెసరపప్పు, బియ్యంలో తగినంత నీరు పోసి 3 విజల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నేతిలో తాలింపు వేగాక ఉడికిన పెసరపప్పు మిశ్రమం కొద్ది సేపు వేగించి కొబ్బరి కోరు, పసుపు, బెల్లం, పాలు, దంచిన మిరియాలు, జీలకర్ర కలిపి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు నిమ్మరసం, ఉప్పు కలపాలి.