Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 14:37PM

నెత్తుటి కోనేరును చూశారా?

చిత్తూరు/కొత్తకోట : శుభ్రంగా ఉన్న నీరు.. గట్టున పచ్చటి చెట్లు.. ఒడ్డున కూర్చోవడానికి బండ.. చల్లటి వాతావరణం.. ఇదంతా మానస సరోవరంలానే ఉంటుంది.. అందుకే దీనికి అటవీశాఖ వారు మానససరోవరం అని నామకరణం చేశారు. నిజానికి ఇది నెత్తుటి కోనేరు! పర్యాటకప్రాంతమైన హార్సిలీహిల్స్‌ గురించి అందరికీ తెలిసిందే. రెండు శతాబ్దాల క్రితం బి.కొత్తకోట మండలం గట్టు సమీపంలోని పోతుపాళెం గుట్ట వద్ద అప్పటి నాగిరెడ్డి కుటుంబం నేటి హార్సిలీహిల్స్‌ వెనుక వైపు నివాసముండేవారు. వీరికి గో సంపద ఎక్కువ. నాగిరెడ్డికి ఐదుమంది సంతానంలో చివరి కుమార్తె మల్లమ్మ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను హార్సిలీహిల్స్‌పైన ఒంటరిగా వదిలేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె విశ్వరూపం ధరించి కొండకు మేతకోసం వచ్చిన వందలాది ఆవుల గొంతులు కొరికి చంపివేసింది. ఆ సమయంలో పారిన రక్తం సమీపంలోని ఓ గుంతలో నిలవడంతో ఇది నెత్తురుకుంటగా ప్రాచుర్యంలోకి వచ్చిందని స్థానిక కథనం. అనంతరం ఆమె అక్కడే మరణించింది.. ఈ ఘటన సుమారు 1800 ప్రాంతంలో జరిగిందని సమాచారం. అనంతరం హార్సిలీహిల్స్‌ పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక అటవీశాఖ వారు నెత్తుటి కోనేరు వద్ద ‘మానస సరోవరం’ అనే బోర్డు ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు. ఈ కొండపైన చూడదగ్గ వాటిల్లో ఇది కూడా ప్రధానమైనది.