Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 14:33PM

కారం పొంగలి

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, పెసరపప్పు - ముప్పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర + మిరియాలు - 1 టీ స్పూను చొప్పున, పచ్చిమిర్చి - 4, అల్లం తరుగు - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: దోరగా వేగించిన పెసరపప్పును బియ్యంతో కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత తగినంత నీరు, ఉప్పుతో పాటు కుక్కర్లో ఉడికించాలి. జీలకర్ర, మిరియాలు దోరగా వేగించి బరకగా దంచుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మిరియాల మిశ్రమం, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి తాలింపు పెట్టి, ఉడికించిన అన్నం మిశ్రమంలో కలపాలి.