Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 14:26PM

గుమ్మడికాయ ఓట్స్‌

కావలసిన పదార్థాలు: ఓట్స్‌ - పావుకప్పు, (ఉడికించిన) గుమ్మడి గుజ్జు - ముప్పావు కప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, లవంగ, యాలకుల పొడి - చిటికెడు చొప్పున, (తరిగిన) బెల్లం - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 3 కప్పులు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో నీరు, ఉప్పు, ఓట్స్‌ వేసి ముప్పావు వంతు ఉడికించాలి. తర్వాత అల్లం, గుమ్మడి గుజ్జు, బెల్లం, దాల్చినచెక్క, లవంగ, యాలకుల పొడులు వేసి 3 నిమిషాలు ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ వేసుకోవాలి. అతి సులభంగా తయారయ్యే వంటకం ఇది.