Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 14:23PM

గులాబి పువ్వులు

కావలసిన పదార్థాలు : మైదా - పావుకేజి, నూనె - అరకేజి, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు -1 స్పూను, వంటసోడా - చిటికెడు.
కావలసిన వస్తువు: గులాబిపువ్వుల అచ్చు కాడ.
తయారుచేసే విధానం : ఒక గిన్నెలో మైదా, ఉప్పు, కారం, సోడా వేసి నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి. గులాబీపువ్వుల అచ్చుని వేడి నూనెలో ముంచి కాలనివ్వాలి. తర్వాత ఆ కాడని కలిపి ఉంచుకున్న జారులో (సగం వరకే) ముంచి వెంటనే నూనెలో వదలాలి. కాడకున్న పిండి పువ్వులా విచ్చుకుని విడిపోతుంది. ఇలా పువ్వులన్నీ దోరగా వేగించుకోవాలి. ఈ పువ్వుల్ని సాయంత్రం స్నాక్స్‌గా తినడానికి పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టపడతారు. ఇలాగే స్వీట్‌ గులాబి పువ్వుల్ని కూడా చేసుకోవచ్చు.