desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 13:52PM

కేవీపీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ

హైదరాబాద్, సెప్టెంబర్ 4 : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో వైఎస్ రాజశేఖర్ చిత్రపటానికి సంబంధించి స్పీకర్‌కు రాసిన లేఖలో స్పీకర్, సభపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేవీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి అసెంబ్లీలో వైఎస్ చిత్రపటాన్ని పెట్టడం అనేది సభా హక్కుల ఉల్లంఘనే అని టీడీపీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. అలాగే సభలో అనుమతిలేకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటాన్ని పెట్టడంపై సెక్షన్ 168 కింది సభా ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటివి పునావృతం కాకుండా ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ టీడీపీ నోటీసుపై ప్రివిలేజ్‌ కమిటీకి పంపుతామని వారి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.