Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 12:18PM

చెనా కబాబ్‌

కావలసిన పదార్థాలు: శనగపప్పు - 200 గ్రాములు, పచ్చిమిర్చి -2, అల్లం - అరస్పూను, వెల్లుల్లి - అరస్పూను, ఉల్లిపాయ - 1, కొత్తిమీర - 1 కట్ట, పుదీనా - 1 కట్ట, నిమ్మరసం - 2 టీ స్పూన్లు, ధనియాల పొడి- అరస్పూను, చాట్‌మసాల - అరస్పూను, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. శనగపప్పుని ఉడికించుకుని, మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో తరిగి ఉంచుకున్న మిగతా పదార్థాలతోపాటు శనగపిండిని కలిపి ముద్దలా తయారుచేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసి, కట్‌లెట్స్‌గా వత్తుకోవాలి. నాన్‌స్టిక్‌ పెనంపైన రెండువైపులా నూనెతో బంగారురంగు వచ్చేదాకా తకాల్చాలి. వేడివేడిగా పెరుగుచట్నీ లేక టమోటో సాస్‌తో తింటే బాగుంటాయి.