Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 12:17PM

బాలకృష్ణకు రెండో ప్లాటినమ్ జూబ్లీ మూవీ 'లెజెండ్'

వంద రోజుల వేడుకలు కనుమరుగై పోతున్నాయి... ఇప్పుడు వసూళ్ల పరంగా క్లబ్బులు ఏర్పడుతున్నాయి... వీటిలోనూ ఏవి నిజమైన వసూళ్ళో తెలియని పరిస్థితి ఏర్పడింది... దాంతో పత్రికల్లో నిర్మాతలు ఇచ్చే ప్రకటనే అసలైన రికార్డు అని కొందరు అంటున్నారు... ఈ నేపథ్యంలో వసూళ్ళ వివరాలను తెలుపుతూ ఏ నిర్మాత కూడా ప్రకటనలు ఇవ్వడం లేదు కానీ, ఏదో విధంగా అంకెలు చెబుతున్నారు... దీంతో మళ్ళీ రన్నింగ్ రికార్డులనే రికార్డుగా భావిస్తున్నారు అభిమానులు... వందలాది థియేటర్లలో విడుదలవుతున్న స్టార్స్ మూవీస్ రన్నింగ్ లో చతికిల పడుతున్నాయి... అందువల్ల రన్నింగ్ లో భారీ రికార్డులు సాధించడం అసాధ్యంగానే ఉంది... ఈ తరుణంలో బాలకృష్ణ నటించిన 'లెజెండ్' 525 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమే... బాలకృష్ణ కెరీర్ లో 75 వారాలు పూర్తి చేసుకున్న రెండో చిత్రంగా 'లెజెండ్' రికార్డు నమోదు చేసింది... ఇంతకు ముందు బాలకృష్ణ నటించిన 'మంగమ్మగారి మనవడు' ఆయన కెరీర్ లో తొలి ప్లాటినమ్ జూబ్లీ మూవీ...ఆ చిత్రం 1984లో విడుదలై హైదరాబాద్ లో ఎనభై వారాలు పూర్తిచేసుకొని చరిత్ర సృష్టించింది... బాలకృష్ణ సోలో హీరోగా అడుగు పెట్టిన తొలి సంవత్సరంలోనే 'మంగమ్మగారి మనవడు'తో తొలి ప్లాటినమ్ జూబ్లీ సొంతం చేసుకున్నారు... కాగా, అది 1984లో సాధ్యమయితే, తరువాత సరిగ్గా 30 ఏళ్ళకు 2014లో 'లెజెండ్'తో మరో ప్లాటినమ్ జూబ్లీ బాలకృష్ణ ఖాతాలో చేరడం విశేషం... ఇలా తెలుగునాట రెండు ప్లాటినమ్ జూబ్లీస్ ఉన్న ఏకైక హీరోగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు... మరో విశేషమేమంటే, ముప్పై ఏళ్ళ క్రితం 'మంగమ్మగారి మనవడు'లో బాలకృష్ణకు నాయికగా నటించిన సుహాసిని 'లెజెండ్'లోనూ నటించడం... కాగా, 'లెజెండ్' చిత్రం 75 వారాలు ప్రదర్శితమైన ప్రొద్దుటూరు పట్టణంలో ఈ సినిమా ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ఈ నెల 6వ తేదీన జరగనున్నాయి...