Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 03:17AM

సైనికుల కుటుంబాలకు 6 వేల భృతి

  •  బడ్జెట్‌లో మాజీ సైనికుల కోసం నిధులు
  •  బలహీన వర్గాల ఇళ్లలో కొన్ని రిజర్వ్‌ చేస్తాం: కేసీఆర్‌
  •  బంగారు తెలంగాణ పుస్తకం ఆవిష్కరణ
  •  సీఎంను కలిసిన మాజీ సైనికోద్యోగులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు, వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేల గౌరవ భృతిని, రూ. 6 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సైనిక అధికారులను వచ్చే రాష్ర్టావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మాజీ సైనికోద్యోగులకు వారి సొంత స్థలాల్లో లేదా ప్రభుత్వ భూముల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కింద కొంత శాతం ఇళ్లను రిజర్వ్‌ చేస్తామని చెప్పారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం వచ్చె బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. గురువారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో సుమారు వంద మంది మాజీ సైనికోద్యోగులు, మాజీ, ప్రస్తుత పోలీసు అధికారులు కలిశారు. పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా    వారినుద్దేశించి సీఎం మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు.
 
బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వామ్యం కావాలని, తద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం అన్నారు. మాజీ సైనికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ సైనికులు కూడా పాల్గొన్నారని సంఘం అధ్యక్షుడు ఎం.సోమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌ కెప్టెన్‌ డీజే రావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎంను కలిసిన వారిలో మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సైనిక సంక్షేమ అధికారి శ్రీనే ష్‌కుమార్‌, సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు కల్నల్‌ రమేశ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.