Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 03:08AM

కేసీఆర్‌ చైనా టూర్‌10 రోజులు !

  •  7న వెళ్లి 16న రాక
  • వినాయక చవితికి ఇక్కడే
  •  ఆ తర్వాతే నామినేటెడ్‌ పదవులపై దృష్టి?
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఅర్‌ చైనా పర్యటన పది రోజులపాటు సాగనుంది. పర్యటన పూర్తి వివరాలు ఒకటి, రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. చైనాలో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో పాల్గొనటం కోసం సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం ఆ దేశానికి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈనెల 7న వారు ఇక్కడి నుంచి బయలుదేరి చైనా వెళ్తారని, తిరిగి 16న హైదరాబాద్‌కు వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 17న వినాయక చవితి ఉండటంతో ఆ సమయానికి రాషా్ట్రనికి చేరుకోవాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
 
ఇదిలావుంటే.. నామినేటెడ్‌ పదవుల భర్తీ మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చైనా పర్యటన ముగిసిన తర్వాతే నామినేటెడ్‌ భర్తీ ఉండవచ్చనే సంకేతాలు టీఆర్‌ఎస్‌ ముఖ్యుల నుంచి వస్తున్నాయి. 17న వినాయక చవితి పండుగ కాగా, 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఈక్రమంలో నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి మరో రెండు, మూడు వారాలపాటు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఇప్పటికే ఆశావహులు తమప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.